News November 12, 2025

HYD: శ్రీధర్‌రావు ఆక్రమణలను తప్పుబట్టిన హైకోర్టు

image

గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. అందుకే హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది.

Similar News

News November 12, 2025

తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

image

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

News November 12, 2025

త్వరలో ఈ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం

image

తెలంగాణలో ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచేలా త్వరలో పలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం కానున్నాయి. సిద్దిపేటలోని నర్మెట్టలో ఆయిల్ ఫెడ్, పెద్దపల్లిలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ, ఖమ్మంలో గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ, ఖమ్మంలోని కల్లూరు గూడెంలో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ, గద్వాల్‌లోని బీచుపల్లిలో ఆయిల్ ఫెడ్, ములుగులో K.N.బయోసైన్సెస్ ఫ్యాక్టరీలు AUG-2026 నాటికి ప్రారంభంకానున్నాయి.

News November 12, 2025

బందోబస్తు ఏర్పాటును పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ

image

వేములవాడ పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పరిశీలించారు. రాజన్న ఆలయంలో భక్తులకు ప్రవేశాలను నిలిపివేసిన నేపథ్యంలో ఆలయ పరిసరాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బందోబస్తును ఇన్చార్జి సీఐ శ్రీనివాస్, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ సీఐ రవికుమార్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించి పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు.