News November 30, 2025
HYD: 0RR చుట్టూ మెట్రో.. సిటీపై భారం తగ్గేనా.!

0RR పరిధిలోని అన్ని ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ చేస్తే బాగుంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాహనదారులకు సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో విస్తరణతో వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణతో నగరానికి కనెక్టివిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 14, 2026
BHPL: గవర్నమెంట్ జాబ్‌కు రాజీనామా.. చివరికి ఓటమి!

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా హరీష్ పోటీ చేసి ఓటమి చెందారు. హరీష్ పంచాయతీ శాఖలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కాంట్రాక్టు ఉద్యోగంలో పనిచేసేవాడు. మూడున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. దీంతో హరీష్‌కు కేవలం 81 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉద్యోగాన్ని వదిలి సేవ చేసేందుకు వచ్చినా వార్డు ప్రజలు ఆదరించలేదు.
News February 14, 2026
జనగామ మున్సిపాలిటీలో వికసించని కమలం!

జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 26 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ, ఏ వార్డులో కూడా గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవని పట్టణంలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 26 వార్డుల్లో రెండు వార్డులు గెలుస్తాయనే ధీమా ఉన్నా.. జిల్లా అధ్యక్షుడి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఓడిపోయారని చర్చ జరుగుతోంది.