News February 15, 2025
HYD: 17న KCRపై స్పెషల్ సీడీ: తలసాని

ఈనెల 17న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీ విడుదల చేస్తామన్నారు.
Similar News
News March 16, 2026
మెదక్: తీవ్ర విషాదం.. పరీక్షకు వెళ్తూ మృతి

మనోహరాబాద్ మండలంలో ఆదివారం <<19387134>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇమాంపూర్ వాసి నిఖిల్(20) అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు మన్నె స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు బైక్‌పై ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 16, 2026
INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.
News March 16, 2026
కర్ణాటక తరలిపోతున్న పెద్దేముల్ సంపద!

పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్, రాంసింగ్ తండా తదితర ప్రాంతాల్లో ఎర్రరాయి అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు సహజమైన సంపదను దోచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రరాయిని వెలికితీసి కర్ణాటకకు తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.


