News August 23, 2025
HYD: 2,016 పడకలతో ‘గాంధీ’ అప్‌గ్రేడ్.. రూ.5 కోట్లతో STP

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి త్వరలోనే 2,016 పడకలతో అప్‌గ్రేడ్ కానుంది. ఇందుకు కావాల్సిన వైద్యులు, సిబ్బందిని నియమించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాక డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసినందుకు STP ప్లాంట్ నిర్మాణానికి అదనంగా అవసరమయ్యే రూ.5 కోట్ల త్వరలోనే కేటాయిస్తామని పేర్కొంది. గాంధీ ఆసుపత్రి సమస్యలన్నింటినీ తీరుస్తామని వివరించింది.
Similar News
News January 18, 2026
గచ్చిబౌలిలో కనువిందు చేసిన డ్రోన్ ఫెస్టివల్

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘డ్రోన్ ఫెస్టివల్ 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఈ డ్రోన్ షోలో రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, పాలపిట్ట వంటి తెలంగాణ చిహ్నాలను ప్రదర్శించారు. ఆకాశంలో డ్రోన్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.
News January 17, 2026
హైదరాబాద్: మ్యూజిక్ లవర్స్‌కు కిరాక్ న్యూస్!

‘ఉత్తర దక్షిణ్’ 15వ సీజన్ నగరానికి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 14న సాయంత్రం 6:30 గంటలకు రవీంద్రభారతిలో ఈ స్వర విందు జరగనుంది. హిందుస్థానీ గాత్ర దిగ్గజం పండిట్ జయతీర్థ మేవుండి, కర్ణాటక వేణుగాన విద్వాంసుడు శశాంక్ సుబ్రమణ్యం పోటీపడి వినిపించే ‘జుగల్బందీ’ హైలైట్ కానుంది. తబలాపై వి.నరహరి, మృదంగంపై సతీశ్ పత్రి లయ విన్యాసాలు చేయనున్నారు. బుక్‌మైషోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
News January 17, 2026
HYD: ఒకేసారి 20 మంది IPS అధికారుల బదిలీ

ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. DGP ఆదేశాల మేరకు 20 మంది IPSలు బదిలీ అయ్యారు. గజరవు భూపాల్, అభిషేక్ మహంతి, భాస్కరన్, చందనా దీప్తి, అన్నపూరణ, రహుల్ హెగ్డే, అపూరవరవు, బాలస్వామి, వెంకటేశ్వరులు, చైతన్య కుమార్, అవినాశ్ కుమార్, కాజల్, శేషాద్రిని రెడ్డి, కంకనాల రాహుల్ రెడ్డి, శివం ఉపాధ్యాయ, శ్రీనివాసులు, రంజన్ రథన్ కుమార, శ్యామ్ సుందర, అశోక్, బాలకోటి బదిలీ అయ్యారు.


