News August 23, 2025
HYD: 25లక్షల మొక్కలు నాటడమే TARGET

GHMC వ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటటమే టార్గెట్ అని అధికారులు తెలిపారు. ఇందులో HYD పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో మొక్కల పంపిణీ చేశారు. 1,500 పార్కులలో మొక్కలు నాటడం, వంతెనలు, కమ్యూనిటీ పార్కులలో పచ్చదనాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం తెలియజేసింది.
Similar News
News January 19, 2026
HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
News January 19, 2026
HYD: TDR అంటే ఏమిటి..? ఎందుకు ముఖ్యం..?

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) అనేది ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే ఓ అదనపు నిర్మాణ హక్కు. చెరువుల FTL, బఫర్ జోన్లు లేదా రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన రైతులకు/ యజమానులకు నగదుకు బదులుగా ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. అలాగే యజమానులు ఆ హక్కులను వేరే చోట అదనపు అంతస్తుల కోసం వాడుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఇది పర్యావరణ పరిరక్షణకు, మౌలిక సదుపాయాల కల్పనకు కీలకం.