News November 20, 2025

HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

image

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్‌పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్‌కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.

Similar News

News January 12, 2026

వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

image

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News January 12, 2026

ప్రకాశం SP ‘మీకోసం’కు 58 ఫిర్యాదులు

image

ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం SP మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. SP కార్యాలయం ఈ వివరాలను ప్రకటించింది.

News January 12, 2026

SKLM: విద్యుత్ సమస్యలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

image

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై AP విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి27వరకు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం SE నాగిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విచారణలు హైబ్రిడ్ విధానంలో యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందన్నారు. టెక్కలి పలాస డివిజన్ కార్యాలయాల నుంచి పాల్గొనవచ్చన్నారు.