News October 5, 2025

HYD: 7న HCU 25వ స్నాతకోత్సవం

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 7న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్నాతకోత్సవంలో 1,717 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం, 182 మంది ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్, 242 మందికి PHD డిగ్రీలు అందించేందుకు ఏర్పాటు చేశారు.

Similar News

News January 22, 2026

త్వరలో జలమండలి విస్తరణ షురూ!

image

జీహెచ్ఎంసీ పునర్విభజనతో జలమండలి విస్తరణ కూడా షురూ కానుంది. శివారు ప్రాంతాల విలీనంతో జలమండలి తన సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుతో సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 12 కొత్త జోన్లు, 60 సర్కిల్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, జలమండలి విస్తరణకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.

News January 22, 2026

HYD @2053 KM.. ఒక్క సంస్థ నీటి సరఫరా సాధ్యమా?

image

మహానగరం పరిధి పెరగింది. దీంతో జలమండలి కూడా పునర్విభజన అనంతరం ఏర్పడ్డ గ్రేటర్ కు నీటి సరఫరా చేయనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సర్కారుకు పంపినట్లు తెలిసింది. అయితే 2053 KM విస్తరించిన నగరానికి ఒక్క వాటర్ బోర్డు నీటి సరఫరా సాధ్యమా అనే అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే నీటి సమస్యలు ఉత్పన్నమవుతుంటే వేల కిలోమీటర్ల పరిధి వరకు సరఫరా ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News January 22, 2026

గ్రేటర్‌లో పెరిగిన విద్యుత్ వినియోగం

image

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం పెరిగింది. వేసవి ఎండలు మొదలు కాకముందే విద్యుత్ వినియోగం పెరగడంపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఒక్కరోజు 3,364 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గతేడాది వేసవిలో 4,190 నమోదు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది మరింతగా వినియోగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.