News August 11, 2025

HYD: 8 అడుగుల నంది.. ఆ ఊరే ఓ గుడి

image

HYD శివారు నందివనపర్తి ఆలయాలకు పుట్టినిల్లు. నాడు నూటొక్క నందులు ఉండేవని, ఓంకారేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, ఏకశిలా నంది ఇక్కడ ప్రధానమైనవని గ్రామస్థులు చెబుతారు. ఏకశిలా నంది ఆలయంలో 8 అడుగుల నంది విశేషంగా ఆకర్షిస్తోంది. హనుమాన్, జ్ఞాన సరస్వతి టెంపుల్స్ కూడా ఉన్నాయి. దీంతో నందివనపర్తి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. HYD నుంచి గంట జర్నీ కావడంతో ప్రతి సోమవారం ఇక్కడికి భక్తులు వెళుతుంటారు.

Similar News

News March 9, 2026

HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

image

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News March 9, 2026

హైదరాబాద్ స్ట్రీట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అడ్డా!

image

HYD యువత ఇప్పుడు ఇంటర్నేషనల్ వైబ్స్‌ను మన లోకల్ స్టైల్‌తో కలిపేస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి పాతబస్తీ వరకు గ్లామర్, క్లీన్-గర్ల్ మినిమలిజం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, కార్గోలతో హుషారుగా కనిపిస్తూనే మన దేశీ జ్యువెలరీతో ‘ఫ్యూజన్’ క్రేజ్ పుట్టిస్తున్నారు. చిన్న ఆన్‌లైన్ లేబుల్స్, స్నీకర్ల స్టైలింగ్‌తో మన HYD Gen-Z అదరగొట్టేస్తున్నారు. మరి మీ స్టైల్ ఏంటో చెప్పండి?

News March 9, 2026

HYD మెట్రో ‘భారం’.. ఆర్థిక సంక్షోభం!

image

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఈ మార్చి నాటికి తుది దశకు చేరుతుంది. సుమారు ₹13,000 కోట్ల అప్పులతో పాటు L&Tకి ₹2,000 కోట్ల సెటిల్మెంట్ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. PPP మోడల్ విఫలమైందని అడ్మినిస్ట్రేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వంపై పడుతున్న ఈ భారీ ఆర్థిక భారం భవిష్యత్తులో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.