News November 14, 2025
HYD: BRSకు కలిసిరాని సింపతి!

జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ సింపతిని నమ్ముకున్న BRSకు కలిసిరాలేదు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో లాస్య నివేదితను నిలబెట్టారు. అక్కడ కూడా సానుభూతి ఓట్లు రాల్చలేదు. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గోపినాథ్ మృతితో అనివార్యమైన జూబ్లీహిల్స్‌లో BRS అధిష్ఠానం ఆ కుటుంబానికే టికెట్ కేటాయించింది. ఇక్కడ మెజార్టీ ప్రజలు సింపతిని ఆదరించలేదు. దీంతో సునీత ఓటమి చవిచూశారు.
Similar News
News November 14, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందు ఉండి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. డివిజన్ల వారీగా హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రిగా ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, రోహిన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: జనసేన మద్దతు.. అయినా BJPకి డిపాజిట్ గల్లంతు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ గల్లంతవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఏపీలో NDA కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇక్కడి ఏపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన BJPకి మద్దతు తెలిపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాగా ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మీటింగ్‌లు, ర్యాలీలలో TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణ TDP నేతలు కాంగ్రెస్ వైపు నిలిచారనే చర్చ కూడా కొనసాగింది.
News November 14, 2025
HYD: ఒంటరి పోరులో ఓటమి!

జూబ్లీహిల్స్ బరిలో ఒంటరి పోరాటం చేసిన BRSకి ఘోర పరాభవం తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అభ్యర్థిని టార్గెట్ చేసిన KTR కారును క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో BJPకి గడ్డు పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీకి <<18286625>>అన్నీ కలిసి వస్తే <<>>ప్రతిపక్షానికి ప్రజలే దిక్కాయ్యారు. ఇది ముందే తెలిసినా బస్తీల్లోకి వెళ్లకుండా చౌరస్తాలో ఊదరగొట్టడం ఓటమికి కారణాలుగా మిగిలాయి.


