News March 7, 2025
HYD: BRS లీడర్ ఇంట్లో విషాదం!

HYD శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. HYD శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్(20) మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కనిష్క్ మూసారాంబాగ్ BRS మాజీ కార్పొరేటర్ తీగల సునరిత, అజిత్ రెడ్డి కుమారుడు. తీగల కృష్ణారెడ్డి బంధువులు అని సమాచారం.
Similar News
News March 23, 2025
వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం: సోము వీర్రాజు

AP: 60 సీట్లు వచ్చినప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటున్నారని BJP MLC సోము వీర్రాజు విమర్శించారు. YCPని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని, ఆ పార్టీకి 20% ఓట్లు కూడా రాకుండా చేస్తామని పేర్కొన్నారు. జగన్‌కు మళ్లీ అధికారమిస్తే అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకుల వల్లే అది నష్టపోయిందని ఆరోపించారు.
News March 23, 2025
కేసీఆర్‌పై నర్సారెడ్డి పోరాటానికి సంపూర్ణ మద్దతు: పొన్నం

మాజీ సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంక్షారెడ్డి చేస్తున్న పోరుబాట పాదయాత్రకు ఆదివారం శామీర్ పేట శివారులో కలిసి సంఘీభావం ప్రకటించారు. చైర్మన్లు కల్వ సుజాత, వెన్నెల, పీసీసీ ప్రతినిధి హరి వర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
News March 23, 2025
SRHvsRR: జట్లు ఇవే

SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, అనికేత్, కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్, షమీ
RR: జైస్వాల్, రాణా, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, శుభమ్ దూబే, జోఫ్రా, తీక్షణ, సందీప్, తుషార్ దేశ్‌పాండే, ఫరూఖీ