News May 22, 2024

HYD: CDFDలో ఇంక్యుబేషన్ దరఖాస్తులు ఆహ్వానం

image

ఉప్పల్ పరిధిలోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింట్ డిటెక్టివ్ సెంటర్లో లైఫ్ సైన్సెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాం సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూన్ 5 వరకు ఈ అవకాశం ఉందని, ఆసక్తి గల అభ్యర్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైఫ్ సైన్సెస్ పై ఆసక్తి గల వారికి నెట్వర్కింగ్, ల్యాబ్ అంశాల పై ట్రైనింగ్ అందిస్తారు.

Similar News

News March 13, 2026

గ్యాస్ కొరత.. అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

image

ఇరాన్‑ యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరతపై సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 86% డొమెస్టిక్, 14% కమర్షియల్ సప్లై ఉండగా, ప్రస్తుత నిల్వలు, సరఫరా ఇబ్బందులను పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

News March 13, 2026

HYD: ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్!

image

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేడు సా.4 గంటలకు సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఉద్యోగుల డిమాండ్లు- ఆర్టీసీ ప్రభుత్వ విలీనం, 2021 పీఆర్సీ, ఉద్యోగ భద్రత, బస్సుల సంఖ్య పెంపు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి 11 అంశాలు- పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు విమర్శించారు.

News March 13, 2026

HYD: ఇంటిపై కూరగాయల సాగు నేర్చుకుంటారా?

image

జంటనగరాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలో కూరగాయలు పెంచాలనుకునే వారికి ఉద్యానశాఖ శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అర్బన్ ఫార్మింగ్ విభాగం సంచాలకులు రామలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉ.10 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు జరుగుతుంది. వివరాలకు 8977714411 ఈ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
# SHARE IT