News November 20, 2025

HYD: DEC30 నుంచి వైకుంఠద్వార దర్శనం

image

TTD వైకుంఠ ద్వార దర్శనం 2025 కోసం DEC 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు HYD అధికారి జయేష్ తెలిపారు. భక్తుల కోసం మొత్తం 164 గంటలకుపైగా దర్శన సమయం కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో కేవలం e-Dip టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. ఈ టైమ్‌లో ఆఫ్‌లైన్ టోకెన్లు పూర్తిగా రద్దు చేశారు.

Similar News

News January 20, 2026

50% రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా అప్లై చేయాలి?

image

తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40% నుంచి 50% రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. దీని వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హతలు, రాయితీ, అందించే యంత్రాలు, దరఖాస్తు వివరాల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 20, 2026

కడప: గుండెపోటుతోనే విజయకుమారి మృతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్

image

సర్వేల పేరుతో వేధించడంతోనే కడపలో సచివాలయ ఉద్యోగిని జి.విజయకుమారి చనిపోయిందని వైసీపీ ట్వీట్ చేసింది. దీనిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘విజయకుమారి దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలోని సచివాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈనెల 18న గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. ప్రభుత్వ వేధింపులతో అని తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అని ట్వీట్ చేసింది.

News January 20, 2026

ప.గో: ఏమిటీ షీప్ ఫూట్ రోలర్లు?

image

​పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్‌కు షీప్ ఫూట్ రోలర్లు వాడాలని విదేశీ నిపుణులు సోమవారం సూచించారు. సాధారణంగా షీప్ ఫూట్ రోలర్లను మట్టిని పటిష్ఠంగా నొక్కడానికి ఉపయోగిస్తారు. ఈ రోలర్ డ్రమ్ చుట్టూ గొర్రె కాళ్ల ఆకారంలో ఉండే ఇనుప మేకులు ఉంటాయి. ఇవి బంకమట్టి వంటి మెత్తటి నేలలను లోతుగా నొక్కి, గాలి బుడగలు లేకుండా చేస్తాయి. డ్యామ్ పునాది గట్టిగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి.