News April 8, 2024

HYD: DGP సాయం.. 32 మందికి పోలీస్ ఉద్యోగాలు

image

DGP రవిగుప్తాను సురక్ష సేవాసంఘం స్టేట్ ప్రెసిడెంట్ గోపిశంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ యువతకు సురక్ష అందించిన ఉచిత పోలీస్ శిక్షణ కోసం DGP గతంలో రూ.1,80,000 ఆర్థిక సాయం అందించారు. DGP సాయంతో బట్టలు, బూట్లు, స్టడీ మెటీరియల్, తరగతుల ఏర్పాటు చేసి 32 మందిని కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దినట్లు శంకర్ తెలిపారు. CI ప్రసన్నకుమార్ చొరవ చూపారన్నారు. డీజీపీకి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 10, 2024

HYD: వీడియోలు తీసి షేర్ చేయడం ఏంటి?: చక్రపాణి

image

HYDలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ కులగణన సర్వే చేస్తున్నారు. కాగా.. కొంత మంది సర్వేపై విమర్శలు చేస్తూ మహిళల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై TSPSC మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి X వేదికగా స్పందించారు. ‘వారు పార్టీ కార్యకర్తలు కాదు. వారు ఉద్యోగులు. వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. DGP చర్యలు తీసుకోవాలి. విమర్శించాలనుకుంటే డైరెక్ట్‌గా మీరే ఓ వీడియో తీసి పోస్ట్ చేయాలి’ అని సూచించారు.

News November 10, 2024

HYD: కోటి దీపోత్స‌వానికి ప్రత్యేక బస్సులు

image

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్స‌వానికి భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 25 వరకు సిటీలోని ప్రముఖ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోఠి  బస్‌ స్టేషన్‌లో 9959226160, రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

News November 10, 2024

FLASH: రేపు HYDలో నీళ్లు బంద్

image

రాజధాని వాసులకు ముఖ్య గమనిక. రేపు (నవరంబర్ 11న) నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్‌ పైప్‌‌లైన్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట పరిధి ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
SHARE IT