News August 12, 2025

HYD: Ed.CET ఫేజ్-1 ఫలితాలు విడుదల

image

Ed.CET 2025 ఫేజ్-1 అలాట్మెంట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఫలితాలను విడుదల చేసినట్లుగా HYD ఉస్మానియా అధికారులు తెలిపారు. ఫలితాలను https://edcetadm.tgche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. అభ్యర్థులకు వచ్చిన కాలేజీలలో అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 14 వరకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

RR: సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి: కలెక్టర్

image

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, రంగారెడ్డి జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందని, ఎలాంటి జాప్యం ఉండదన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదన్నారు.

News March 13, 2026

టీజేఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా సత్యనారాయణ

image

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా రావుల సత్యనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.గౌరీ నియామకపత్రం విడుదల చేశారు. సత్యనారాయణ నేటి నుంచే బాధ్యతలు చేపట్టనున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రమణారావు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ తదితర రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

News March 13, 2026

RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

image

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.