News November 17, 2025

HYD: iBOMMA రవి అరెస్ట్‌పై సీపీ ప్రెస్‌మీట్

image

iBOMMA రవి అరెస్ట్‌పై నేడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ పోలీసులు బ్లాక్ చేశారు. ‘ఐబొమ్మ’ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్‌లు ప్రమోట్ చేసి రవి రూ.కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Similar News

News January 23, 2026

GNT: సమగ్రశిక్షలో ఖాళీకి దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు సమగ్రశిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ ఖాళీ భర్తీకి ఫారిన్ సర్వీస్ నిబంధనల ప్రకారం డిప్యూషన్ పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు DEO సలీమ్ బాషా తెలిపారు. 55 సం.ల లోపు కలిగిన ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు 5సం.ల సర్వీస్, సెకండరీ గ్రేడ్ టీచర్లు 8 సం.ల సర్వీస్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News January 23, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 992 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో అదనంగా 3,026 టన్నుల సరఫరా రానుందని పేర్కొన్నారు. ఇప్పటికే 22,175 టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

News January 23, 2026

టాస్ గెలిచిన భారత్

image

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అక్షర్, బుమ్రాకి రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో కుల్దీప్, హర్షిత్ రాణాను తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్, ఫౌల్క్స్, హెన్రీ, సోథీ, జాకబ్.