News August 19, 2025

HYD: KBR పార్క్ వద్ద పనులు పర్యవేక్షించిన మంత్రి

image

HYD KBR పార్క్ వ‌ద్ద నిలిచిన వ‌ర‌ద నీటిని హైడ్రా తొల‌గించింది. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, GHMC మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఈ స‌మ‌స్య‌ను కౌన్సిల్‌లో పెట్టి పైపులైన్ల ఏర్పాటు ప‌నుల‌ను మంజూరు చేయిస్తామని మంత్రి, మేయర్ అధికారుల‌కు చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ నీరు నిల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారుల‌కు సూచించారు.

Similar News

News January 19, 2026

మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

image

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.

News January 19, 2026

ఎమ్మిగనూరు: విషాదం.. తల్లీకూతురి మృతి

image

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట(M) జానంపేట సమీపంలోని NH-44పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన తల్లీకూతురు రాధ (42), లక్ష్మీదుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఆటో, బొలెరో వాహనాలు ఢీకొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News January 19, 2026

VKB: ధారాళంగా కారుతున్న వేపకల్లు.. ఎక్కడో తెలుసా!

image

ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు కారడం సహజంగా చూస్తూ ఉంటాం.. కానీ వేప చెట్టుకు దారాళంగా రోజుకు మూడు లీటర్ల వరకు కల్లు కారుతున్న అద్భుత దృశ్యం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామంలోని చావిడి దగ్గర కనిపించింది. వేప కల్లు చేదు స్వభావాన్ని కలిగి ఉన్న సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని గ్రామస్థులు తెలిపారు.