News August 23, 2025

HYD: NIMSలో ఆగస్టు 30న BSc నర్సింగ్ కౌన్సెలింగ్

image

పంజాగుట్ట NIMS ఆస్పత్రి వద్ద బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలకు అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని డీన్ డా.రాజశేఖర్ తెలిపారు. ఇప్పటికే NIMS వెబ్‌సైట్ www.nims.edu.inలో అర్హుల జాబితా అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, కౌన్సెలింగ్ లెటర్ పట్టుకొని నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో ఉ.10 గంటలకు హాజరు కావాలన్నారు.

Similar News

News January 17, 2026

వరంగల్: మే తర్వాతే డివిజన్ల రిజర్వేషన్లు.!

image

వరంగల్ గ్రేటర్ నగరపాలక సంస్థ డివిజన్ల రిజర్వేషన్లు మే తర్వాత ఖరారు కానున్నాయి. ప్రస్తుతానికి మేయర్ పీఠం ఎవరికో మాత్రమే తేలింది. వరంగల్ గ్రేటర్ మేయర్ జనరల్‌కు ఖరారు కావడంతో మాజీ ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు, యువ నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈరోజే డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారని అనుకొగా, మే వరకు ప్రస్తుత పాలక వర్గానికి సమయం ఉండటంతో, మే తర్వాతే రిజర్వేషన్లు తేలనున్నాయని అధికారులు తెలిపారు.

News January 17, 2026

నల్గొండ: పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: కలెక్టర్ చంద్రశేఖర్

image

జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకగా ఈ కేటాయింపులు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

News January 17, 2026

జిల్లాలో 5 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం: కలెక్టర్‌

image

ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో జిల్లాలో 5 వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. శనివారం గుంటుపల్లిలోని రైజ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నీతి ఆయోగ్‌ రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాకు ఈ కేంద్రాన్ని మంజూరు చేసిందని వెల్లడించారు. మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.