News December 2, 2025

HYD: Privacy ఒక్కటే ప్రశ్నార్థకం?

image

లక్షలాది మంది ‘క్రెడిట్-ఇన్విజిబుల్’ కుటుంబాలకు రుణాలిచ్చేందుకు TIB ఏర్పాటు ప్రతిపాదనలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. TGDeX ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేసే TIB డేటా గోప్యతకు కట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వనుందని అధికారుల మాట. అయితే, ఈ లాభాపేక్షలేని ప్రభుత్వ సంస్థ పనితీరుపై కొందరు ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. Privacy మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

Similar News

News February 18, 2026

పాలమూరు: ప్రవేశ పరీక్ష.. ఈనెల 22న లాస్ట్!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఈనెల 22న ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతి ప్రవేశంతో పాటు 6-9 తరగతుల ఖాళీల భర్తీకి ఈ పరీక్ష జరుగుతుంది. 84 కేంద్రాల్లో 31,809 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

News February 18, 2026

Lupus: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

image

కొందరిలో రోగనిరోధక వ్యవస్థ గాడితప్పి హానికారకాలకు, ఆరోగ్య కణజాలానికి మధ్య తేడాను గుర్తించలేదు. దీంతో యాంటీబాడీలు మన శరీర కణజాలం మీదే దాడి చేస్తాయి. దీన్నే లూపస్ అంటారు. ఇదొక ఆటోఇమ్యూన్ డిసీజ్. లూపస్‌తో బాధపడేవారు చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తారు. నిస్సత్తువ, జ్వరం, నోట్లో పుండ్లు వంటి లక్షణాలు ఉంటాయి. కానీ జబ్బు నిర్ధరణ అయ్యేసరికే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతింటాయి.

News February 18, 2026

Lupus: ఈ సమస్య ఆడవారిలోనే ఎక్కువ

image

లూపస్‌ వ్యాధి బాధితుల్లో 90% మంది మహిళలే. సంతానోత్పత్తి సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ హార్మోన్లు చురుకుగా ఉండటమే దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. దీన్ని నిర్ధారించడానికి న్యూక్లియర్‌ యాంటీబాడీ, డబుల్‌స్ట్రాండ్‌ DNA, రక్తంలో C3, C4 ప్రొటీన్లు.. యాంటీఫాస్ఫోలిపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. క్రమంతప్పకుండా మందులు వాడితే ఏ ప్రమాదం ఉండదు.