News April 1, 2024
HYD: RRR మార్గంలో మార్పులు!

రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. RRR ఉత్తర భాగంలోని యాదాద్రి జిల్లా పరిధిలో అలైన్‌మెంట్‌లో ఈ మార్పులు జరగనున్నట్టు సమాచారం. అధికారులు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అలైన్‌మెంట్ మార్పుతో DPRలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
Similar News
News February 17, 2026
మల్కాజిగిరి: 74 వార్డుల ‘మాస్’ అడ్డా.. తూర్పున కమలం జోరు!

ఈస్ట్ HYDలోని 74 వార్డులతో ఏర్పడిన మల్కాజిగిరి కార్పొరేషన్ (MMC) ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ గ్రౌండ్. ఉప్పల్, ఎల్బీనగర్‌లో బీజేపీకి ఉన్న బలమైన ‘హిందూ-మాస్’ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలతో ఢీకొట్టాలనుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం.. ఇక్కడ BJP-INC మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగబోతోందా? BRS మూడో స్థానానికి పడిపోగా! తూర్పున జెండా పాతేందుకు BJP తన శక్తినంతా ఒడ్డాల్సి ఉంది.
News February 17, 2026
HYD: పెళ్లైంది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?

‘ఆఫీసులో ఫైళ్లు.. ఇంట్లో గిన్నెలు.. ఈ నరకం ఎన్నాళ్లు’.. కొత్తగా పెళ్లైన ఐటీ ఉద్యోగినుల ఆవేదన ఇది. సమానత్వం అని మాటల్లో చెబుతున్నా ఇంటి బాధ్యతలు మాత్రం ఇంకా ఆడవారికే అప్పజెప్పుతున్నారు. అత్తమామల నిఘా, ఇంటి పనుల భారం భరించలేక ఆఫీసునే ఒక ‘సేఫ్ జోన్’గా భావిస్తున్నారు. అందుకే ఇంటికి త్వరగా వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పని ఒత్తిడి కంటే ఈ ‘రోల్ ఓవర్‌లోడ్’ యువతను ఇంటికి దూరం చేస్తోంది.
News February 17, 2026
సైబరాబాద్: 76 వార్డుల్లో సెటిలర్ల ‘సైలెంట్’ సునామీ!

కొత్తగా ఏర్పడిన CYB కార్పొరేషన్ (CMC) ఇప్పుడు 76 వార్డులతో IT బెల్ట్‌లో తన పట్టు చాటుతోంది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా ఆంధ్ర, నార్త్ ఇండియన్ సెటిలర్ల ఓట్లపైనే ఆధారపడి ఉన్నాయి. గత పోల్స్‌లో BRS తన పాత కోటను కాపాడుకోవాలని చూసినా అధికార కాంగ్రెస్ తన ‘డెవలప్‌మెంట్’ కార్డుతో సెటిలర్లను ఆకట్టుకుంది. ఇక్కడ <<19167954>>మజ్లిస్<<>> ప్రభావం లేకపోవడంతో ఫైట్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే సాగుతోంది.


