News August 13, 2025

HYD: SPTUలో డిప్లమా ఇన్ మ్యాజిక్‌లో దరఖాస్తుల ఆహ్వానం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహింపబడుతుందన్నారు. ఆసక్తి గలవారు 9059794553కు సంప్రదించాలన్నారు.

Similar News

News March 9, 2026

BREAKING.. దండేపల్లి: విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

image

దండేపల్లి మండలం మేదరిపేట ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్సై తహసీద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి ఇనుప స్టాండ్‌ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యారు. మృతులు మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేటకు చెందిన నాగరాజుగా గుర్తించారు. వారు సిమెంట్ ట్రేడర్స్‌లో పని చేస్తున్నారు.

News March 9, 2026

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

image

మంగళగిరి AIIMS వసతిగృహంలో డయేరియా కలకలం రేపింది. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ పరిస్థితికి కారణమని అనుమానిస్తున్న అధికారులు, హాస్టల్ నుంచి 40 నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

News March 9, 2026

ఆ ముగ్గురికీ T20WC ట్రోఫీ అంకితం: గంభీర్

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ T20WC విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్‌, అగార్కర్‌లకు అంకితం ఇచ్చారు. టీమ్ గెలుపు బాటలో నడవడానికి అవసరమైన వ్యవస్థను వారు నిర్మించారని కొనియాడారు. ‘ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు స్థిరత్వాన్ని కాపాడారు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ లక్ష్మణ్ జాతీయ స్థాయిలో ప్రతిభను వెలికితీస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు.