News October 7, 2025
HYD: TGPSC సభ్యులుగా ఇద్దరు ఐపీఎస్ అధికారులు

G.O. Ms. No.198 ప్రకారం ఐపీఎస్ అధికారులు చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమితులై సోమవారం HYDలోని కార్యాలయంలో విధులు చేపట్టారు. TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రోగ్రాంలో కమిషన్ సభ్యులు అమీరుల్లా ఖాన్, ప్రొ.యదయ్య, పళవై రాజానీ కుమారి, ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్, సెక్రటరీ డా.ప్రియాంక పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
రిపబ్లిక్ డే.. దీపికకు ప్రెసిడెంట్ ఇన్విటేషన్

భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్, ఏపీకి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర వేడుకలకు రావాలంటూ ఆమెకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆహ్వానం పంపారు. శ్రీసత్యసాయి జిల్లాలోని తంబాలహట్టికి వెళ్లిన అధికారులు దీపికకు ఇన్విటేషన్ అందజేశారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల అంధుల జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో దీపికపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
News January 13, 2026
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల

రఘునాథపాలెం మండలం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే రోజున శంకుస్థాపన చేసి, నేడు నీళ్లిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. మంచుకొండ లిఫ్ట్‌తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
News January 13, 2026
నెల్లూరు వాసికి కీలక పోస్టింగ్

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.


