News October 7, 2025

HYD: TGSRTC‌లో డ్రైవర్లు కావలెను

image

వాయు కాలుష్య నివారణలో భాగంగా సిటీలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టింది. దశలవారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రీన్ బస్సులను నడిపేందుకు TGSRTC డ్రైవర్ల నియామకం చేపట్టింది. ఆసక్తిగలవారు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్‌తో నేరుగా రాణిగంజ్ బస్ డిపో నందు జరిగే రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు.
SHARE IT

Similar News

News January 23, 2026

HYD: CNG కావాలంటే క్యూ కట్టాల్సిందే!

image

వారం రోజులుగా సిటీలో CNG గ్యాస్ దొరకడం లేదని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్దనున్న పెట్రోల్ బంక్‌లో గత 3-4 గంటల నుంచి క్యూ కట్టారు. ఇతర బంకుల్లోనూ CNG కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. CNG నింపుకోవడానికి దినం గడిచిపోతుందని.. బిజినెస్ ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు. సమస్య తీర్చాలంటున్నారు.

News January 23, 2026

చర్లపల్లి నుంచి కేరళకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌

image

HYD ప్రయాణికులకు గుడ్‌న్యూస్. చర్లపల్లి నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు సరికొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. కేరళలో ప్రధాని మోదీ ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. తక్కువ ఛార్జీతోనే విమానం రేంజ్ సౌకర్యాలు, కుదుపులు లేని ప్రయాణం సామాన్యుడికి సొంతం కానుంది. ప్రతి మంగళవారం చర్లపల్లిలో 7.15 AMకి, ప్రతి గురువారం 11.30 PMకి తిరువనంతపురంలో స్టార్ట్ అవుతుంది.
SHARE IT

News January 23, 2026

రిపబ్లిక్ డే అలర్ట్: సికింద్రాబాద్ గగనతలంపై ‘నో ఫ్లై’ జోన్!

image

JAN 26న పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ భద్రతను పెంచుతున్నారు పోలీసులు. జనవరి 26న ఆకాశంలో డ్రోన్లు ఎగిరేస్తే ఇక కటకటాలే. బేగంపేట, మార్కెట్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డ్రోన్లు, పారా-గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పూర్తి నిషేధం విధించారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.