News November 9, 2025

HYD-VJA హైవే విస్తరణ.. అభివద్ధికి కొత్త మార్గం

image

HYD-VJA హైవేను 8 వరుసలకు విస్తరించాలనే ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విస్తరణతో జిల్లాలోని సూర్యాపేట, నార్కట్‌పల్లి వంటి ప్రాంతాల్లో కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు, సరుకు రవాణా వేగవంతమవుతుంది. తద్వారా పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుని, ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కొత్త మార్గాలు తెరచుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News January 23, 2026

₹లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

image

TG: మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామని తెలిపారు. ‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాదు. ప్రతివారం బిల్లులు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్లు నిర్మించుకోవాలి. బిల్లు చెల్లించే బాధ్యత మాది’ అని ఆసిఫాబాద్ జిల్లా జంగాంలో చెప్పారు.

News January 23, 2026

కడప జిల్లాలో VRO సస్పెండ్.!

image

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.

News January 23, 2026

KNR: స్థానిక సంస్థల నుంచే ఉన్నత శిఖరాలకు..

image

ఉమ్మడి KNR జిల్లా నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్, రామగుండం మాజీ MLAలు సోమారపు సత్యనారయణ, కోరుకంటి చందర్, KNR మాజీ MLAలు చల్మెడ ఆనందరావు, జువ్వాడి చంద్రశేఖర్‌రావు, ఇందుర్తి మాజీ MLA బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ MLCలు సంతోష్ కుమార్, గోపాల్ రావు తదితరులు కార్పొరేటర్ల నుంచే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.