News November 8, 2025

HYD-VJD హైవే 8 లేన్లకు విస్తరణ: కోమటిరెడ్డి

image

HYD-VJD జాతీయ రహదారి 8 లేన్లకు విస్తరించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10,400 కోట్లతో ఈ రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. దండు మల్కాపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు ఈ రోడ్డును ఎక్స్ ప్యాండ్ చేస్తామన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 4 వరుసల రోడ్డు 8 వరుసలుగా మారనుంది. గతంలో ఆరు లేన్లుగా నిర్మించాలనుకున్నప్పటికీ రద్దీ దృష్ట్యా 8 లేన్లుగా విస్తరించనున్నారు.

Similar News

News January 20, 2026

కడప: గుండెపోటుతోనే విజయకుమారి మృతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్

image

సర్వేల పేరుతో వేధించడంతోనే కడపలో సచివాలయ ఉద్యోగిని జి.విజయకుమారి చనిపోయిందని వైసీపీ ట్వీట్ చేసింది. దీనిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘విజయకుమారి దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలోని సచివాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈనెల 18న గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. ప్రభుత్వ వేధింపులతో అని తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అని ట్వీట్ చేసింది.

News January 20, 2026

ప.గో: ఏమిటీ షీప్ ఫూట్ రోలర్లు?

image

​పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్‌కు షీప్ ఫూట్ రోలర్లు వాడాలని విదేశీ నిపుణులు సోమవారం సూచించారు. సాధారణంగా షీప్ ఫూట్ రోలర్లను మట్టిని పటిష్ఠంగా నొక్కడానికి ఉపయోగిస్తారు. ఈ రోలర్ డ్రమ్ చుట్టూ గొర్రె కాళ్ల ఆకారంలో ఉండే ఇనుప మేకులు ఉంటాయి. ఇవి బంకమట్టి వంటి మెత్తటి నేలలను లోతుగా నొక్కి, గాలి బుడగలు లేకుండా చేస్తాయి. డ్యామ్ పునాది గట్టిగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి.

News January 20, 2026

జనగామ: ఆస్తి రాసుకున్నారు.. కన్నవారిని గెంటేశారు!

image

నవమాసాలు మోసి పెంచిన కుమారులు, ఆస్తి చేతికి రాగానే కన్నవారినే నడిరోడ్డుపై నిలబెట్టిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. బచ్చన్నపేట మండలం ఆలింపూర్‌కు చెందిన వృద్ధ దంపతులు యశోద, సత్యనారాయణ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. తమకున్న 8.39 ఎకరాల భూమిని కుమారులు శ్రీహరి, నరహరి పేర్ల మీద రాసుకున్నారని, ఇప్పుడు తమను ఇంటి నుంచి బయటకు గెంటేశారని వాపోయారు.