News April 5, 2025
HYD: WGL రూట్.. భువనగిరి టోల్ గేట్ రేట్లు..!

✓కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనం ఒక వైపు రూ.125, అప్, డౌన్ రూ.190 ✓లైట్ కమర్షియల్, గూడ్స్ వాహనం, మినీ బస్సు రూ.205, అప్&డౌన్ రూ.305 ✓బస్సు ట్రక్కుకు ఒక వైపు రూ.425, అప్& డౌన్ రూ.635 ✓కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.465, అప్ & డౌన్ రూ.695✓HCM, EME వాహనం ఒకవైపు రూ.665, అప్ & డౌన్ రూ.1,000✓ ఓవర్ సైజ్ వాహనం ఒక వైపు రూ.810, అప్ & డౌన్ రూ.1,215✓ నెలవారీ పాస్ ధర రూ.340 నుంచి ప్రారంభమవుతాయి.
Similar News
News April 20, 2025
భీమదేవరపల్లిలో త్రికుటేశ్వర స్వామి ఆలయం!

కాకతీయులు 12వ శతాబ్దంలో నిర్మించిన త్రికుటేశ్వర స్వామి ఆలయం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో ఉంది. ఈ ఆలయం హనుమకొండ వేయి స్తంభాల గుడి ఆకారాన్ని పోలి ఉంది. కాకతీయులు ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం భక్తుల దర్శనార్థం పునర్ నిర్మించబడింది. ఇక్కడ శివుడు త్రికుటేశ్వర రూపంలో మూడు దిక్కుల భక్తులకు దర్శనమిస్తారు.
News April 20, 2025
జిల్లాలో మంచిని సమస్య లేకుండా చూడండి: రాజనర్సింహ

జిల్లాలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా మంచిది సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2025
పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.