News November 23, 2024
HYD: ‘కాకతీయ కళలు సంస్కృతికి నిదర్శనం’
హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ రూబీ పాల్గొన్నారు. ఓరుగల్లు కాకతీయుల కళా ప్రదర్శనను చూసిన ప్రొఫెసర్ మంత్రముగ్ధులయ్యారు. కాకతీయుల కళలలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనమనికీర్తించారు. కాకతీయ మహారాణి రుద్రమదేవి పౌరుషంతో ప్రతి మహిళ తన గుండెలో పోరాట పటిమను నింపుకోవాలన్నారు.
Similar News
News November 23, 2024
HYD: బీసీ సంక్షేమానికి సమరభేరి: ఆర్.కృష్ణయ్య
జనగణనలో కులగణన, BCల కోసం 50% రిజర్వేషన్లకు పార్లమెంట్ బిల్లు, క్రీమిలేయర్ తొలగింపు, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాట్లను డిమాండ్ చేస్తూ నవంబర్ 25న రవీంద్రభారతిలో BC సంక్షేమ సమరభేరిని నిర్వహిస్తున్నట్లు BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. సమరభేరికి BC కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.
News November 23, 2024
HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి
అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.