News February 19, 2025
HYD:”17 మంది నిందితులకు జీవితఖైదు”

నల్గొండ జిల్లా SC, ST స్పెషల్ సెషన్స్ కోర్టు అడ్డగూడూర్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. పాత కక్షల కారణంగా అజీంపేట(V)కి చెందిన బట్ట లింగయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. రాచకొండ పోలీసులు వేగంగా విచారణ జరిపి, పక్కా సాక్ష్యాలను సమర్పించడంతో నిందితులకు కఠిన శిక్ష పడింది.
Similar News
News March 27, 2025
రంగారెడ్డి జిల్లా వెదర్ UPDATE

రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం తాళ్లపల్లిలో 39.5℃, మాడ్గుల్ 39.4, రాజేంద్రనగర్, కాసులాబాద్ 39.3, ఎలిమినేడు, కందువాడ, తట్టిఅన్నారం 39.2, చుక్కాపూర్, చందనవల్లి, కొందుర్గ్, మంగళపల్లె, కడ్తాల్, యాచారం 39.1, మామిడిపల్లి 39, మీర్‌ఖాన్‌పేట, దండుమైలారం, రెడ్డిపల్లె 38.9, ఆమన్‌గల్, మొగలిగిద్ద, కేశంపేట, షాబాద్ 38.8, గున్గల్, HCU 38.7, ఇబ్రహీంపట్నంలో 38.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 27, 2025
HYD: పెరుగుతున్న ట్యాంకర్ల పెండెన్సీ

HYDలో జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికి పెరిగుతోంది. జలమండలి పరిధిలో 75 ఫీలింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కానీ ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిగూడ, షాపూర్‌నగర్, గచ్చిబౌలి-2, మణికొండ, ఫతేనగర్‌లతోపాటు మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో డెలివరీకి 2, 3 రోజులు పడుతుందని జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
News March 27, 2025
బంజారాహిల్స్‌లో ఇఫ్తార్ విందులో మేయర్ విజయలక్ష్మీ

రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని బంజారాహిల్స్‌లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ మేయర్, కార్పొరేటర్ కవితా, టి. నారాయణ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింపజేశారు. రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇస్తార్ విందు ఇవ్వడం అభినందనీయమని మేయర్ అన్నారు.