News November 7, 2025
HZB: ఫేక్ కిడ్నాప్ కాల్.. కుప్పకూలిన తండ్రి

HZB సమీపంలోని బోర్నపల్లికి చెందిన మాసాడి లక్ష్మణ్‌రావుకు పాకిస్థాన్ నంబర్ నుంచి “నీ కొడుకును కిడ్నాప్ చేశాం, వెంటనే రూ.50వేలు పంపించు” అంటూ ఫేక్ కాల్ వచ్చింది. దీంతో అమెరికాలో ఉన్న కుమారుడిని లక్ష్మణ్‌రావు సంప్రదించే ప్రయత్నం చేశాడు. కాల్ కనెక్ట్ కాకపోవడంతో భయాందోళనకు గురైన తండ్రి హైBPతో కుప్పకూలాడు. పోలీసులు స్పందించి ఆయన్ను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం HNK ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News January 14, 2026
ఎంఎస్‌ఎంఈ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోమవరప్పాడులో పార్కు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి, సమగ్ర నివేదిక పంపాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.
News January 14, 2026
అరసవల్లిలో ‘సామాన్య’ దర్శనానికే పెద్దపీట

అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకే అగ్రతాంబూలం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలనిన్నారు
News January 14, 2026
BJPలోకి హరీశ్ అని ప్రచారం.. ఖండించిన BRS

TG: మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే హరీశ్ కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారని ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ కమలం గూటికి వెళ్లబోతున్నారని అందులో ఉంది.


