News February 27, 2025
ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం: KTR

TG: సినీ నిర్మాత కేదార్ మరణం గురించి సీఎం రేవంత్ చేసిన <<15587966>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారు. తాను ఏం చెప్పినా జనాలు నమ్ముతారని అనుకోవడం పొరపాటే. ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉంది. ఎలాంటి విచారణకైనా సిద్ధం’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 12, 2025
నోట్లు తీసుకొని.. ఓట్లు మరిచారు!

TG: జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో 50శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ప్రధాన పార్టీలు రూ.వందల కోట్లు పంచినట్లు తెలుస్తున్నా.. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటర్లు ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల బస్తీవాసులు హక్కు వినియోగించుకోగా అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు ఆసక్తి చూపలేదు. ఇక ఇక్కడ ఉంటూ వేరే ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు లేకపోవడమూ పోలింగ్‌పై ప్రభావం చూపింది.
News November 12, 2025
హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.
News November 12, 2025
పెట్టుబడుల సదస్సుకు సిద్ధం.. నేటి రాత్రికే విశాఖకు సీఎం

AP: ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో CM చంద్రబాబు ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు. రేపు సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష, పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి వారికి డిన్నర్ ఇస్తారు. సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.


