News March 31, 2024
రాష్ట్ర ప్రజల కోసమే తగ్గాను: పవన్ కళ్యాణ్

AP: వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసమే తాను తగ్గానని తెలిపారు. జనసేన-టీడీపీ కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని అన్నారు. నాయకుల మధ్య ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలని.. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు.
Similar News
News February 13, 2026
ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం
News February 13, 2026
టీమ్ ఇండియాకు అతిపెద్ద విజయం

నమీబియాతో మ్యాచులో 93 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది. T20 WCలో పరుగులు పరంగా మెన్ ఇన్ బ్లూకు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2012లో ఇంగ్లండ్‌పై 90, 2014లో ఆస్ట్రేలియాపై 73, 2022లో జింబాబ్వేపై 71 రన్స్ తేడాతో గెలిచింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుస విజయాల సంఖ్య 10కి చేరింది. గత మ్యాచులో సౌతాఫ్రికా(8) రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
News February 13, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


