News April 25, 2024
నేనలా అనలేదు.. అంబటి రాయుడు ఫైర్

LSG చేతిలో CSK ఓటమికి కెప్టెన్ రుతురాజ్ వైఫల్యమే కారణమని తాను వ్యాఖ్యానించినట్లు వస్తున్న వార్తలపై అంబటి రాయుడు స్పందించారు. ‘ఆరోజు నేను కామెంటరీ చేయలేదు. నా తోటలో మామిడిపండ్లు కోస్తున్నా. ఏదైనా రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించండి. ఇలాంటి వాటిని వ్యాప్తి చేయకండి’ అంటూ ఫైరయ్యారు. రాయుడు వ్యాఖ్యలకు ‘క్రెడిట్ ధోనీ.. బ్లేమ్ గైక్వాడ్’ అంటూ నవజోత్ సిద్ధూ కౌంటర్ వేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News April 16, 2026
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 100 శాతం ఫలితాల సాధనకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈనెల 17 నుంచి రెమిడీయల్ తరగతులు నిర్వహించి, సప్లమెంటరీలో వారు రాణించేలా చూడాలన్నారు.

LIC HFLలో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <