News February 27, 2025
అనుకోకుండా గెలవలేదు.. అలవాటు చేసుకున్నారు: సచిన్

CTలో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ టీమ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు అనుకోకుండా గెలిచారని ఇకపై ఎవరూ భావించొద్దన్నారు. అఫ్గాన్ కుర్రాళ్లు గెలుపులను అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన జద్రాన్, 5 వికెట్లు తీసిన ఒమర్‌జాయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News February 27, 2025
రేపటి డేట్‌తో ముందు రోజు అరెస్ట్ ఏంటి?: శ్యామల

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి డేట్‌తో ముందు రోజు అరెస్ట్ చేయడం ఏంటి? అని YCP అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ‘ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయలేక అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని అక్రమ అరెస్టు ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
News February 27, 2025
నేడు SLBC టన్నెల్‌కు BRS బృందం

TG: ప్రమాదం జరిగిన SLBC టన్నెల్ వద్దకు ఇవాళ బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నాయకులు HYDలోని తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా వెళ్లనున్నారు. అయితే తమను పోలీసులు అడ్డుకోవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సహాయ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇన్నిరోజులు తాము అక్కడికి వెళ్లలేదని తెలిపారు.
News February 27, 2025
100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే!

దేశంలోని 140 కోట్లకు పైగా జనాభాలో 100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే అని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అంచనా వేసింది. స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారులు 13-14కోట్లే అని పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పర్సుల్లోంచి డబ్బులు తీయడం స్టార్ట్ చేశారని తెలిపింది. మరోవైపు, దేశంలోని 57.7శాతం సంపద కేవలం 10శాతం మంది భారతీయుల వద్దే ఉందని బ్లూమ్ వెంచర్స్ స్పష్టం చేసింది.