News November 25, 2024

నేను రాజీనామా చేయలేదు: నానా పటోలే

image

మ‌హారాష్ట్ర పీసీసీ చీఫ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ను నానా ప‌టోలే ఖండించారు. 2019లో 44 స్థానాల నుంచి తాజా ఫలితాల్లో కాంగ్రెస్ 16 స్థానాల‌కు ప‌త‌న‌మ‌వ్వ‌డంతో ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ ఆయ‌న రాజీనామా చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని నానా ప‌టోలే స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రాన మ‌హా వికాస్ అఘాడీ చెక్కుచెద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు.

Similar News

News December 14, 2024

కంగ్రాట్స్ గుకేశ్: ఎలాన్ మస్క్

image

ప్రపంచ విజేతగా నిలిచిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజుకు వివిధ రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలుపగా తాజాగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ‘కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. 18 ఏళ్లకే 18వ వరల్డ్ ఛాంపియన్ అని గుకేశ్ చేసిన ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు.

News December 14, 2024

రైతు రుణాలు.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

image

రైతు రుణాలపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే <<14805545>>లోన్ లిమిట్ రూ.2 లక్షలకు<<>> పెంచగా జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడనుందని కేంద్రం పేర్కొంది.

News December 14, 2024

బన్నీకి రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది : RGV

image

హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైరయ్యారు. ‘తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ అందించి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అని RGV ట్వీట్ చేశారు.