News March 26, 2024
ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి

TG: ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని, ప్రణీత్ రావు ఎవరో తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రణీత్ రావు కూడా చెప్పారని పేర్కొన్నారు. ఏం జరిగిందో విచారణలో తేలుతుందని చెప్పారు. ఇతర పార్టీలో చేరాలని ఆఫర్లు వస్తున్నా.. తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Similar News
News February 19, 2026
సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News February 19, 2026
ప్రతి జిల్లా కాంప్లెక్స్‌లో తెలంగాణ తల్లి విగ్రహం

TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 33 జిల్లా కేంద్ర కార్యాలయ భవనాల కాంప్లెక్సుల్లో వీటి ఏర్పాటుకు రూ.5.80 కోట్ల విడుదలకు పాలనా అనుమతి జారీచేసింది.
News February 19, 2026
తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్‌డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.


