News March 31, 2024

నాకు ప్రేమలో పడాలనుంది: మృణాల్

image

తనకు ప్రేమలో పడాలని అనిపిస్తోందని స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘నేను ఇప్పటివరకూ ఏ రిలేషన్‌షిప్‌లోనూ లేను. షూటింగ్స్ వల్ల పర్సనల్ లైఫ్ మిస్సవుతున్నా. నాకూ సాధారణ జీవితం గడపాలని ఉంది. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నా. కానీ ఇండస్ట్రీలోకి రావడంతో అది కుదరలేదు. నాకు మరణం అంటే భయం. నేను చనిపోతే నా కుటుంబం ఏమవుతుందో భయంగా ఉంటుంది’ అని ఆమె చెప్పారు.

Similar News

News February 18, 2026

ఎందుకలా: ఉప్పగానే సముద్రపు నీరు..

image

వర్షం పడినప్పుడు నీరు గాలిలోని CO₂తో కలిసి ఆమ్లంగా మారుతుంది. ఆ తర్వాత నదుల్లోకి చేరి రాళ్లు, మట్టిని కరిగిస్తూ సోడియం, క్లోరైడ్ వంటి లవణాలను సముద్రంలో చేరుస్తుంది. ఆపై సూర్యుడి వేడితో నీరు ఆవిరైనప్పుడు లవణాలు సముద్రంలో మిగిలిపోతాయి. ఇలా కోట్లాది ఏళ్లుగా జరుగుతూ సముద్ర నీటి సగటు లవణీయత 3.5%కి చేరింది. ఇందులో 85% Nacl ఉంటుంది. సముద్ర గర్భంలో ఉండే హైడ్రోథర్మల్ వెంట్స్ కూడా లవణాల వృద్ధికి సాయపడతాయి.

News February 18, 2026

కరవు నుంచి జలసిరి.. అభినందించాల్సిందే!

image

మహారాష్ట్రలోని బన్సావర్గావ్ గ్రామస్థులు ఐకమత్యంతో కరవును జయించి ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు 700 అడుగుల లోతున బోర్లు వేసినా చుక్క నీరు దొరకని స్థితి నుంచి నేడు ట్యాంకర్ రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. ప్రజలంతా కలిసి ఐకమత్యంతో కాలువలు తవ్వడం, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, బిందు సేద్యం చేపట్టడంతో భూగర్భ జలాలు పెరిగాయి. సంకల్పం ఉంటే ప్రకృతిని సైతం అనుకూలంగా మార్చుకోవచ్చని ఈ గ్రామం నిరూపించింది.

News February 18, 2026

ఫాల్గుణ మాసం: ఈ వ్రతం చేస్తే ఎంతో పుణ్యం

image

ఫాల్గుణ మాసంలో వయో వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే ‘సర్వయజ్ఞ ఫలప్రదం’ అంటారు. అదితి దేవి తన కుమారులైన దేవతలకు తిరిగి స్వర్గరాజ్యం లభించాలని ఈ వ్రతాన్ని ఆచరించిందట. అలా వామనుడిని పుత్రుడిగా పొందిందని పురాణ గాథ. కోరిన కోరికలు నెరవేరడానికి, సంతాన ప్రాప్తికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, కష్టాల నుంచి విముక్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.