News November 24, 2024
ఆ పని నేను చేయను: DY చంద్రచూడ్
65 ఏళ్ల వయసులో తన పని పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల అనుమానాల్ని కలిగించే ఏ పని చేయబోనని Ex CJI DY చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. NDTV సదస్సులో రాజకీయాల్లో చేరికపై ప్రశ్నించగా చంద్రచూడ్ ఈ విధంగా స్పందించారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినా, సమాజం వారిని న్యాయమూర్తిగానే చూస్తుందన్నారు. ఇతరులను అంగీకరించినట్టు(రాజకీయాల్లో చేరడం), జడ్జిల చేరికను సమాజం అంగీకరించబోదన్నారు.
Similar News
News December 11, 2024
‘పుష్ప-2’ అద్భుతం: వెంకటేశ్
‘పుష్ప-2’ సినిమాపై విక్టరీ వెంకటేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘అల్లు అర్జున్ అద్భుతమైన ప్రదర్శన స్క్రీన్‌పై నుంచి నా దృష్టిని మరల్చనివ్వలేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది. రష్మిక నటన, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతం. పుష్ప-2 సూపర్ సక్సెస్ అయినందున డైరెక్టర్ సుకుమార్‌కి, చిత్రయూనిట్‌కు అభినందనలు’ అని వెంకీ ట్వీట్ చేశారు.
News December 11, 2024
మోహన్‌బాబుకు బిగ్ రిలీఫ్
TG: మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు సమయం కావాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అటు ప్రతి రెండు గంటలకోసారి ఆయన ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
News December 11, 2024
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలివే
మెదడులో కణితి పెరగడాన్ని బ్రెయిన్ ట్యూమర్‌గా వ్యవహరిస్తారు. ముందుగా గుర్తిస్తే దీని చికిత్స సాధ్యమే. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. తరచూ తలపోటు, ఫిట్స్, చూపు మందగించడం, వికారం, వాంతులు, శరీరంలో సమన్వయ లోపం, జ్ఞాపకశక్తి తగ్గుదల, తరచూ కోపం రావడం, తడబాటు, బలహీనత, వినికిడి మందగించడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే చెక్ చేయించుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.