News September 12, 2025

రాజకీయాల్లోకి వెళ్లను: బ్రహ్మానందం

image

తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని కమెడియన్ బ్రహ్మానందం అన్నారు. ఆయన ఆత్మకథ ‘నేను మీ బ్రహ్మానందం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. బ్రహ్మానందం 30ఏళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని వెంకయ్య కొనియాడారు. తన జీవితం గురించి ఈ బుక్‌లో రాశానని బ్రహ్మానందం తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చానని, లెక్చరర్‌గా పనిచేశానని చెప్పారు.

Similar News

News December 13, 2025

21న 54 లక్షల మందికి పోలియో చుక్కలు

image

AP: నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్‌ డే సందర్భంగా ఈనెల 21న రాష్ట్రంలో 54 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనికోసం 38,267 బూత్‌లు ఏర్పాటు చేసి 61,26,120 డోస్‌ల వ్యాక్సిన్‌ను రెడీ చేశామన్నారు. ఆరోజు చుక్కలు వేసుకోలేని పిల్ల‌లకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.

News December 13, 2025

మరో ఘటన.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

image

AP: సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాంవలి కాలనీలో కుక్క స్వైర విహారం చేసింది. వీధిలోని ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఆ పిల్లాడి చెవి సగానికిపైగా తెగిపోయింది. బాబుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై <<18545957>>కుక్క దాడి<<>> చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే.

News December 13, 2025

మెస్సీ ఈవెంట్‌తో సంబంధం లేదు: ఫుట్‌బాల్ ఫెడరేషన్

image

మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో జరిగిన ఘటనపై ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) స్పందించింది. ‘అది PR ఏజెన్సీ నిర్వహించిన ప్రైవేటు ఈవెంట్. ఈ కార్యక్రమం నిర్వహణ, ప్లాన్, అమలు విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫెడరేషన్ నుంచి అనుమతి కోరలేదు’ అని స్పష్టం చేసింది. మరోవైపు మెస్సీ రావడం, ప్రేక్షకులకు చేతులు ఊపడం వరకే ప్లాన్‌లో ఉందని బెంగాల్ DGP రాజీవ్ కుమార్ తెలిపారు.