News November 1, 2024

తప్పు చేసిన వారిని వదలను: చంద్రబాబు

image

AP: నాయకుడు ప్రజల మనసుల్లో అభిమానం సంపాదించుకోవాలని CM చంద్రబాబు అన్నారు. నాయకులు వస్తే చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం వంటివి ఉండకూడదని చెప్పారు. ఈదుపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. గత ఐదేళ్లు స్వేచ్ఛ లేని జీవితాన్ని అనుభవించాం. నేను రాజకీయ కక్ష సాధింపులు చేయను. కానీ తప్పు చేసిన వాళ్లను వదలను’ అని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 9, 2024

త్వరలో ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌పై అప్టేడ్ వచ్చింది. ‘ఫస్ట్ సింగిల్’ లోడింగ్ అంటూ బాలయ్యతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో అతి త్వరలోనే సాంగ్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

News December 9, 2024

పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపులు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు కలకలం రేపాయి. ఆయనను చంపేస్తానని ఓ అగంతకుడు డిప్యూటీ సీఎం ఆఫీసుకు మెసేజ్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు దీనిపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.

News December 9, 2024

జమిలి ఎన్నికలు: ఈ సమావేశాల్లోనే బిల్లు!

image

జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు NDA ప్రభుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్‌ బిల్లును ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే స‌భ ముందుకు తెచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. సభలో చర్చ అనంతరం దీనిపై JPCని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. Sep 18న రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.