News January 17, 2026
IBPS జాబ్ క్యాలెండర్ విడుదల

IBPS పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రీజినల్ రూరల్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. PO పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ AUG 22, 23న, మెయిన్స్ OCT 4న నిర్వహించనుంది. SO పోస్టులకు ప్రిలిమ్స్ AUG 29న, మెయిన్స్ NOV 1న, CSA పోస్టులకు OCT 10, 11 తేదీల్లో ప్రిలిమ్స్, DEC 27న మెయిన్స్ నిర్వహించనుంది. RRB ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు షెడ్యూల్‌ను పైన చూడవచ్చు.
Similar News
News February 15, 2026
‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి.. అనుమానాలు?

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న అతడు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు మత్స్యకారులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గతంలో ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారారు.
News February 15, 2026
CNF అంటే ఏంటో తెలుసా?

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It
News February 15, 2026
సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


