News April 26, 2024

అలా అయితే భారత్‌లో మా సేవలు ఉండవు: వాట్సాప్

image

ఢిల్లీ హైకోర్టులో ఐటీ నిబంధనలపై విచారణ సందర్భంగా వాట్సాప్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతోనే యూజర్లు తమ సమాచారం సేఫ్‌గా ఉందనే ధీమాతో వాట్సాప్ వాడుతున్నారు. ఒకవేళ మమ్మల్ని కేంద్రం ఈ ఎన్‌క్రిప్షన్ తొలగించమంటే ఇండియాలో మా సేవలను రద్దు చేసుకుంటాం. 2021లో తెచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం లక్షల మెసేజ్‌లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాలి. ఈ రూల్ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని పేర్కొంది.

Similar News

News April 14, 2026

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే?

image

గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘OG’ సినిమా పార్ట్-2 పనులు మొదలైనట్లు సమాచారం. ఇందులో పవర్ స్టార్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ మరో లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఓజస్ గంభీర-ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్. పవన్ డేట్స్‌ను బట్టి షూటింగ్ మొదలవుతుందట.

News April 14, 2026

సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్.. తెలుసుకోకుంటే డేంజరే!

image

ఇళ్లు, హోటళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ తేదీ దాటినవి వాడితే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. సిలిండర్ పైభాగంలోని నంబర్లను బట్టి వాటి కాలపరిమితిని తెలుసుకోవచ్చు. A-27, B-28, C-29, D-30 నంబర్లు ఉంటే అందులో A: జనవరి-మార్చి, B: ఏప్రిల్-జూన్, C: జులై-సెప్టెంబర్, D: అక్టోబర్- డిసెంబర్ అని అర్థం. నంబర్లు ఏడాదిని సూచిస్తాయి. A-27 అంటే 2027 మార్చి వరకు అది సేఫ్.
#ShareIt

News April 14, 2026

ప్లీజ్.. పిల్లల ముందు గొడవలొద్దు!

image

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం గొడవ పడొద్దు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల మనసును బాధిస్తుంది. మరికొందరు నైబర్స్‌తో ఘర్షణకు దిగుతారు. అలాంటి సందర్భాల్లోనూ పిల్లలు భయానికి గురవుతారు. ఇది వారిలో అభద్రతాభావానికి దారి తీస్తుంది. భవిష్యత్తులో వారూ చెడు మాటలు మాట్లాడటం, పెరిగి పెద్దయ్యే క్రమంలో గొడవలకు దిగే ప్రమాదం ఉంటుంది.