News July 7, 2024
కారు ఆపితే నా భార్య బతికి ఉండేది.. బాధితుడి ఆవేదన

నిందితుడు BMW కారు ఆపి ఉంటే తన భార్య బతికి ఉండేదని <<13583473>>హిట్ అండ్ రన్<<>> ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కావేరి భర్త ప్రదీప్ అన్నారు. నిందితులు పెద్ద వాళ్లని, వారిని ఎవరూ ఏం చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. చేపలు విక్రయిస్తూ జీవనం సాగించే ఈ దంపతులు బైక్‌పై వెళుతుండగా శివసేన నేత కుమారుడు కారుతో ఢీకొట్టడంతో భార్య కావేరి మరణించారు. కాగా నిందితుడు మద్యం తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Similar News
News December 7, 2025
మీ తోబుట్టువును గౌరవిస్తున్నారా?

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బానధవా|
తం తు దేశం న పశ్యామి యత్ర బాత్రా సహోదరా||
సహోదరుల బంధం గురించి రాముడు పలికిన మాటలివి. ఈ బంధం విశ్వంలో ఎక్కడా దొరకనంత అమూల్యమైనదని దీనర్థం. సోదరులతో చిన్న మనస్పర్ధలు వచ్చినా, సరిచేసుకుని కలిసి ఉండాలి. ఎక్కడికెళ్లినా భార్యలు, బంధువులు దొరుకుతారు కానీ, తోబుట్టువు దొరకరు. అందుకే ఈ బంధాన్ని దేంతో పోల్చలేము. అంత అపురూపమైనది. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవించుకోవాలి.
News December 7, 2025
బేబీ గ్రోత్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

తల్లి గర్భంలో పిండం ఎదుగుదల తెలుసుకోవడానికి ముందు వయసు సరిగా నిర్ధారించుకోవాలి. మూడు నెలలకు ఓసారి స్కాన్ చేయించాలి. తల్లి అధిక బరువు ఉన్నా, బరువు తక్కువగా ఉన్నా..35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల పిండం బరువు పెరగక పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిండం ఎదగనప్పుడు కొన్ని సమస్యలు కనిపిస్తాయి. తల్లి కడుపు నుంచి రక్తం ఆగి ఆగి వెళ్లడంగానీ వెనక్కి వచ్చినా పిండం కడుపులోనే చనిపోవచ్చు.
News December 7, 2025
పుతిన్ వెళ్లారు.. జెలెన్‌స్కీ వస్తున్నారు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల ఇండియా టూర్ ముగిసిన వెంటనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై ఢిల్లీ కసరత్తు మొదలుపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు అంటున్నారు. శాంతి విషయంలో భారత్ తటస్థంగా ఉండదన్న PM మోదీ వ్యాఖ్యలు ఈ దౌత్య ధోరణికి బలం చేకూర్చాయి.


