News May 15, 2024
సినిమా హిట్టే.. మాకు డబ్బులివ్వలేదు: నాగశౌర్య తల్లి

హీరో నాగశౌర్య కెరీర్లో మంచి హిట్‌గా నిలిచింది ‘ఛలో’. అయితే ఆ మూవీకి తమకు డబ్బులు రాలేదని ఆయన తల్లి ఉష మూల్పూరి ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ సినిమా కోసం శౌర్య చాలామంది నిర్మాతల దగ్గరకు తిరిగాడు. అదంతా వద్దని మేమే నిర్మాతలుగా మారాం. ఆ సినిమా హిట్ అయినా డిస్ట్రిబ్యూటర్లెవరూ డబ్బులివ్వలేదు. అదే ‘నర్తనశాల’కు మాత్రం ఫ్లాపవ్వగానే ఉదయాన్నే డబ్బు కోసం ఆఫీసుకొచ్చి కూర్చున్నారు’ అని తెలిపారు.
Similar News
News December 17, 2025
8,113పోస్టులు.. CBAT షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది విడుదల చేసిన 8,113 <
News December 17, 2025
బుల్లెట్ రైలు ట్రాక్ కోసం Soil Test!

AP: బెంగళూరు-HYD, HYD-చెన్నై మార్గాల్లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. HYD-చెన్నై మార్గం గుంటూరు జిల్లా.. బెంగళూరు-HYD మార్గం అనంతపురం జిల్లా మీదుగా వెళ్తుంది. ఇందులో భాగంగా నిన్న అనంతపురం(D) బుక్కరాయసముద్రం ఏరియాలో భూపరీక్షలు నిర్వహించింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సిద్ధం చేస్తున్న గ్రౌండ్ రిపోర్టులో భాగంగానే భూపరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.
News December 17, 2025
కౌలు రైతులకు రూ.లక్ష రుణం, ఎవరికి రాదు?

AP: ప్రభుత్వం భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చే దారకస్తు భూమి(DKT), అసైన్డ్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అనర్హులు. అలాగే సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం లేని వారు, సభ్యత్వం లేని వారికి రుణం రాదు. సొంత ఇల్లు ఉన్నవారికే రుణాల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో ఈ నిబంధనలపై పూర్తి క్లారిటీ రానుంది.


