News March 31, 2024
అధికారం లేకపోతే క్షణం ఉండలేకపోతున్నారు

దేశవ్యాప్తంగా రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో తాము గెలిచి, పార్టీ ఓడితే వెంటనే అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అన్ని చోట్లా ఇదే తంతు. ఒక పార్టీని మించి మరో పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన సొంత క్యాడర్‌ను నట్టేట ముంచి నాయకులు స్వలాభం చూసుకుంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా.. అది అధికార పార్టీకి చుట్టంగా మారిందనే విమర్శలున్నాయి.
Similar News
News February 11, 2026
నటుడి ఆవేదన.. సాయానికి ముందుకొస్తున్న సెలబ్రిటీలు

₹9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ <<19103948>>జైలులో సరెండరైన<<>> విషయం తెలిసిందే. ఆదుకునేందుకు ఎవరూ రాలేదంటూ వాపోయిన ఆయన కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. రాజ్‌పాల్‌కు తన చిత్రంలో అవకాశం ఇస్తానని సోనూ సూద్ తెలిపారు. తాను ₹1.1 కోట్లు ఇస్తానని GemTunes Music ఓనర్ రావ్ ఇంద్రిజిత్ సింగ్ ప్రకటించారు. నటుడు గుర్మీత్, పొలిటీషియన్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సాయం చేస్తామని అన్నారు.
News February 11, 2026
మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.
News February 11, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.


