News April 1, 2024
మేం రూపాయి పన్ను చెల్లిస్తే 29 పైసలే తిరిగొస్తోంది.. ఎందుకు?: స్టాలిన్

కచ్చతీవు అంశంలో DMKపై PM మోదీ చేసిన <<12965771>>విమర్శలకు<<>> తమిళనాడు సీఎం స్టాలిన్ Xలో కౌంటర్ ఇచ్చారు. ‘పదేళ్లుగా కుంభకర్ణ నిద్రలో ఉండి హఠాత్తుగా మత్స్యకారులపై దొంగ ప్రేమ చూపుతున్న వారికి 3 ప్రశ్నలు. రాష్ట్రం చెల్లిస్తున్న రూపాయి పన్నుకు కేంద్రం 29 పైసలు మాత్రమే ఎందుకిస్తోంది?. 2023లో వరద సాయంగా ఒక్క రూపాయీ ఎందుకివ్వలేదు?. 10ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికి ఒక్క పథకమైనా అమలుచేశారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 13, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 13, 2026
‘వారణాసి’ జానర్‌పై క్లారిటీ

వారణాసి సినిమా జానర్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కాదని.. మైథలాజికల్ ఫాంటసీ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా రన్‌టైమ్ 3 గంటలకు కాస్త తక్కువ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని.. మిగిలిన దాన్ని జూన్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్‌పై ఫోకస్ పెడతామని పేర్కొన్నారు.
News February 13, 2026
పిచ్చి తుగ్లక్‌లు చాలా మంది ఉంటారు: KTR

TG: <<19122392>>నేనే రాజు నేనే మంత్రి<<>> అనుకున్న చాలా మంది గాలికి కొట్టుకుపోయారని, ఎవరూ శాశ్వతం కాదని KTR విమర్శించారు. పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారని ఎద్దేవా చేశారు. ‘ఇందిర, NTR, KCR లాంటి నాయకులే ఓడిపోయారు. రేవంత్ రెడ్డిలా విర్రవీగిన వాళ్లు వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యం అలానే ఉంది’ అని తెలిపారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని CPIతో కలిసి గెలుచుకున్నామని, కొత్తగూడెంలో ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు.


