News April 20, 2024

మూడోసారి గెలిస్తే UCC అమలు చేసి తీరుతాం: అమిత్ షా

image

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘మన దేశం షరియా చట్టాలపై నడవాలా? వ్యక్తిగత చట్టాలపైన నడవాలా? ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ వ్యక్తిగత చట్టాలకు చోటు లేదు. మరి భారత్‌లో ఎందుకున్నట్టు? పలు ముస్లిం దేశాలే షరియా చట్టానికి దూరంగా ఉంటున్నాయి. మనమూ ముందడుగు వేయాలి’ అని తెలిపారు.

Similar News

News December 16, 2025

కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

image

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.

News December 16, 2025

NIPERలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్ (NIPER) 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. BE, బీటెక్, B.COM, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://niperahmnt.samarth.edu.in

News December 16, 2025

డెలివరీ తర్వాత డిప్రెషన్‌ తగ్గాలంటే

image

గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈక్రమంలో కొందరు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఒత్తిడి, ప్రెగ్నెన్సీలో సమస్యలు, వంశపారంపర్యం వల్ల కూడా కొందరు డిప్రెషన్‌ బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోవడం, సన్నిహితులు, కుటుంబీకులతో ఎక్కువగా గడపడం, సరిపడా నిద్రపోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>