News May 22, 2024
మైనర్‌కి వాహనం ఇస్తే మీరు జైలుకే!

2019లో సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. మైనర్‌కు వాహనం ఇస్తే ఆ తర్వాతి పర్యవసానాలకు దాని యజమాని బాధ్యులవుతారు. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.25వేల ఫైన్ పడే అవకాశం ఉంటుంది. భారతదేశంలో జువెనైల్స్ వల్ల ట్రాఫిక్ నేరాలు పెరగడంతో ఈ సవరణను తీసుకొచ్చారు. పుణేలో 17ఏళ్ల బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన కేసులో అతడి తండ్రి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News March 7, 2026
US-ఇరాన్ పోరు.. డిస్కౌంట్‌లో బంగారం!

US, ఇజ్రాయెల్-ఇరాన్ పోరు ప్రభావం బంగారంపైన పడింది. దుబాయ్‌లో వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి (31 గ్రాములు) దాదాపు 30 డాలర్ల డిస్కౌంట్‌కు అమ్మేసుకుంటున్నారు. విమానాల రద్దుతో ఎగుమతులకు అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక భారత్‌లో సమృద్ధిగా బంగారం నిల్వలు ఉన్నందున సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేదు.
News March 7, 2026
వార్ ఎఫెక్ట్.. రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

ముడి చమురు ధర దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 90 డాలర్లకు పెరిగింది. 2024 APR తర్వాత ఆ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ధర 25% పెరిగింది. ఒక వారంలో ఈ రేంజ్ హైక్ చివరగా 2020 ఏప్రిల్‌లో నమోదైంది. ఇరాన్‌తో చర్చలకు ఛాన్స్ లేదని ట్రంప్ చెప్పడం, గల్ఫ్‌లో తగ్గని ఉద్రిక్తత, కువైట్ ఉత్పత్తిని తగ్గిస్తోందనే వార్తలతో ధరలకు రెక్కలొచ్చాయి.
News March 7, 2026
మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నారు.. కానీ: ఇరాన్ అధ్యక్షుడు

మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజ్‌కియాన్ వెల్లడించారు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు వెనుకాడబోమన్నారు. మధ్యవర్తిత్వం వహించాలనుకుంటున్న దేశాలు యుద్ధం ప్రారంభించిన దేశాలపై దృష్టిసారించాలని సూచించారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ తగ్గితే కానీ తాము తగ్గబోమని హింట్ ఇచ్చారు.


