News April 20, 2024

ఇళయరాజా వారికంటే గొప్పేం కాదు: హైకోర్టు

image

ముత్తుస్వామి, త్యాగరాజర్, శ్యామశాస్త్రి కంటే ఇళయరాజా గొప్పవారేం కాదంటూ మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. పలు రికార్డింగ్ సంస్థలకు తన పాటల్ని వాడుకునే ఒప్పందం గడువు పూర్తయిందని, తనకు హక్కుల్ని ఇప్పించాలని ఇళయరాజా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సంస్థలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రాజా తరపు న్యాయవాది పున:సమీక్ష కోరుతూ ఇళయరాజా అందరికంటే గొప్పవారని అనగా కోర్టు ఆ వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది.

Similar News

News December 17, 2025

Avatar-3కి షాకింగ్ రివ్యూస్

image

ఈనెల 19న రిలీజ్ కాబోతున్న అవతార్3కి కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇప్పటికే రివ్యూస్ ఇచ్చేస్తున్నాయి. BBC, గార్డియన్, రోటెన్ టొమాటోస్, IGN సహా మీడియా హౌజెస్ మూవీ స్టోరీ ఆకట్టుకోదని చెబుతున్నాయి. కామెరూన్ టేకింగ్, యాక్షన్ బాగున్నా కొన్ని సీన్స్ గతంలో చూశాం అనే ఫీల్ కల్గిస్తాయట. BBC 1/5, గార్డియన్ 2/5 రేటింగ్ ఇచ్చాయి. కాగా అవతార్1కు మంచి రెస్పాన్స్ రాగా, పార్ట్2ను క్రిటిక్స్ ఓకే అన్నారు.

News December 17, 2025

రబీ సీజన్.. అందుబాటులో 2 లక్షల మె.టన్నుల యూరియా

image

AP: రబీ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించింది. ప్రతి జిల్లాలో 21 రోజులకు సరిపడా యూరియాను బఫర్ స్టాకుగా ఉంచుకోవాలని, 2 రోజులకు ఒకసారి యూరియా నిల్వలపై మీడియాకు సమాచారం అందించాలని, రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు.

News December 17, 2025

చేతిలో డబ్బు నిలవాలంటే..

image

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.