News October 30, 2025

అపారనష్టం.. కేంద్రం జాతీయ విపత్తుగా పరిగణించాలి: పొన్నం

image

TG: భారీ వర్షాలతో పంటలకు అపారమైన నష్టం వాటిల్లిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి సాయం అందించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందిస్తుందని, అవసరమైన సాయం అందజేస్తుందని తెలిపారు. మరోవైపు రాజకీయాలకు తావు లేకుండా బీజేపీ నేతలు పరిస్థితిని కేంద్రానికి వివరించాలని సూచించారు.

Similar News

News November 2, 2025

తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

image

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

నదుల పక్కన ఇంటి నిర్మాణాలు చేయవచ్చా?

image

వాగులు, నదుల పక్కన ఇల్లు కట్టుకోవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. జల ప్రవాహాలు ఎక్కువైతే.. ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. ‘నీటి ఒత్తిడి వల్ల పునాదుల బలం తగ్గి, ఇంట్లో స్థిరత్వం లోపిస్తుంది. ప్రకృతి శక్తుల వైపరీత్యం నుంచి ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, వరుణ దేవుని ఆగ్రహానికి గురికావొద్దంటే ఈ స్థలాలను నివారించాలి. భద్రత కోసం వీటికి దూరంగా ఉండటం ఉత్తమం’ అని చెప్పారు. <<-se>>#Vasthu<<>>

News November 2, 2025

అవి నిరాధార ఆరోపణలు: ప్రశాంత్ వర్మ

image

తనపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖండించారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు. ‘నాకు, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఉన్న వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉంది. దీనిపై వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా వివాదాలు సృష్టించవద్దు’ అని ఓ ప్రకటనలో కోరారు.