News July 4, 2024

గత ఆరు నెలల్లో ఈ ఐదు స్టాక్స్‌దే హవా!

image

సెన్సెక్స్ గత ఏడాది డిసెంబరు 11 నుంచి ఈనెల 3 మధ్య 10వేల పాయింట్లు పెరిగింది. మార్కెట్ విలువ ₹138.89లక్షల కోట్ల నుంచి ₹158లక్షల కోట్లకు చేరింది. ఐదు స్టాక్స్ నుంచే మార్కెట్లలో 50% వృద్ధి నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, SBI, మహీంద్రా & మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక TCS, అదానీ పోర్ట్స్, HDFC వంటి 11 స్టాక్స్‌తో 30% వృద్ధి నమోదైంది.

Similar News

News December 17, 2025

స్మిత్‌కు ‘వర్టిగో’.. మూడో టెస్టుకు దూరం

image

యాషెస్ మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ అనారోగ్యానికి గురయ్యారు. వర్టిగో(తల తిరగడం లాంటి పరిస్థితి)కు గురవడంతో అతడికి రెస్ట్ ఇచ్చి ఉస్మాన్ ఖవాజాను జట్టులోకి తీసుకున్నారు. తల తిరుగుడు, వికారంతో స్మిత్ బాధపడుతున్నట్లు CA తెలిపింది. మరోవైపు ఫస్ట్ సెషన్‌లో AUS 94-2 రన్స్ చేసింది. రెండో సెషన్‌ ప్రారంభంలో ఒకే ఓవర్లో ఆర్చర్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో కమిన్స్ రీఎంట్రీ ఇచ్చారు.

News December 17, 2025

30కి పైగా దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

image

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్‌ విధించారు. ఇటీవల 12 దేశాలపై విధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 30కి పైనే ఉంది. పాలస్తీనా, సిరియా, జింబాబ్వే సహా అనేక దేశాలు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌పై కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దేశ పౌరుల రికార్డుల విషయంలో నమ్మకం లేకపోవడంతో పాటు అవినీతి, క్రిమినల్ కేసులు వంటివి కారణాలుగా పేర్కొన్నారు.

News December 17, 2025

పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

image

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.