News March 11, 2025
బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చండి: DK అరుణ

తెలుగు రాష్ట్రాల్లోని బోయ, వాల్మీకిలను ఎస్టీల జాబితాలో చేర్చాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తెలంగాణలో 5 లక్షల మందికిపైగా బోయ వాల్మీకులున్నారని, ఎస్టీలపై చెల్లప్ప కమిషన్ కేంద్రానికి నివేదిక పంపిందని తెలిపారు. ఈ విషయంపై గిరిజన శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News March 22, 2025
టెన్త్ పేపర్ లీక్: ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని SLBC బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన అధికారులపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. అలాగే పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థినిని కూడా డిబార్ చేసింది. కాగా నిన్న తెలుగు ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
News March 22, 2025
విరాట్ మంచోడు.. కానీ అది మైదానంలో దిగనంతవరకే: సాల్ట్

విరాట్ కోహ్లీపై ఆయన ఆర్సీబీ టీమ్ మేట్ ఫిల్ సాల్ట్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉంటారు. కానీ అది మైదానంలో దిగనంతవరకే. గ్రౌండ్‌లో ఆయన తీవ్రత వేరే స్థాయిలో ఉంటుంది. యుద్ధాన్ని కోరుకుంటారు. ఈ సీజన్లో ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. సాల్ట్ గత సీజన్‌లో కేకేఆర్‌కు ఆడారు.
News March 22, 2025
జనరేటర్లు పనిచేయకే ఎయిర్‌పోర్టు మూసివేత!

లండన్‌లోని <<15833839>>Heathrow<<>> ఎయిర్‌పోర్టులో బ్యాకప్ పవర్ లైన్ పనితీరుపై చర్చ జరుగుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు మేనేజ్మెంట్ ఇక్కడ డీజిల్ జనరేటర్లను బయోమాస్ జనరేటర్లతో రిప్లేస్ చేసింది. పవర్ సరఫరా చేసే సబ్‌స్టేషన్ తగలబడటంతో ఎయిర్‌పోర్టు నిన్నంతా మూతబడింది. దాంతో 1300 విమానాలు, 2లక్షలకు పైగా ప్రయాణికులపై ప్రభావం పడింది. ఎమర్జెన్సీ టైమ్‌లో బయో జనరేటర్లు పనిచేయలేదన్న వార్తలు విమర్శలకు దారితీశాయి.